
గోల్కొండ సాహితీ మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఎంతో గానో అలరించాయి. నగరంలోని మలక్‌పేటకు చెందిన విద్యా విజ్క్షాన హైస్కూల్, కార్వాన్ సరస్వతి శిశుమందిర్, అంబర్ పేట్ స్వామి దయానంద్ హైస్కూల్, గుడిమల్కాపూర్ వివేకానంద హై స్కూల్, నాగోల్ సాయిభూపతి హైస్కూల్, నాచారం విద్యాభారతి హైస్కూల్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు హైదరాబాద్ విమోచనం అంశంపై అద్భుతమైన నాటికను ప్రదర్శించారు. ఇందులో 6 అంశాలను ఆరు పాఠశాలల వారు ప్రదర్శించారు. వీటిలో దాశరథి పాత్ర, మహిళా ఉద్యమకారిణి, నెహ్రు, సర్దార్ పటేల్, వానమామలై, సురవరం ప్రతాపరెడ్డి, షోయబుల్లాఖాన్, వందేమాతరం రాంచంద్రారావు, పాత్రదారులు అందరినీ ఆకట్టుకున్నారు. హైదరాబాద్ విమోచనాన్ని పిల్లలు కళ్ళకు కట్టినట్టు చూపించారు. అనంతరం సంస్కార భారతి ఆధ్వర్యంలో మాతృస్తవం అనే అంశంపై ఒక నృత్యరూపకం ప్రదర్శించారు. దీంట్లో పిల్లలు దాస్యంలో మగ్గతుంటే తల్లి పడే వేదనను హృద్యంగా ప్రదర్శించారు.