క‌రీంన‌గ‌ర్ లో గోల్కొండ సాహితీ మ‌హోత్స‌వ్ పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

హైదరాబాద్ లో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వహించే “గోల్కొండ సాహితీ మ‌హోత్స‌వ్”   కార్యక్రమానికి పెద్ద ఎత్తున జాతీయవాద కవులు, ర‌చ‌యితలు త‌ర‌లిరావాల‌ని కరీంనగర్ జాతీయ సాహిత్య‌ పరిషత్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీ గాజుల‌ రవీందర్, శ్రీ నంది శ్రీనివాస్ కోరారు.  నవంబర్ 14 నాడు  (ఆదివారం) కరీంనగర్ లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఈ సాహితీ ఉత్స‌వానికి సంబంధించిన పోస్ట‌ర్‌ను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత సంఘచాలక్ మాననీయ బూర్ల దక్షిణామూర్తి గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఉత్సవాలు 75వ‌ “స్వాతంత్య్ర అమృత మహోత్స‌వ్” ప్రధాన అంశంగా జరుగుతాయని తెలిపారు. స్వాతంత్య్ర సంగ్రామంలోకి నిస్వార్థంగా దూకిన వీర కిశోరాలను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా నేటితరం యువత నాటి స్వాతంత్య్ర వీరుల త్యాగనిరత, దేశభక్తిని అర్థం చేసుకొని స్పూర్తిని పొందే అవకాశం కలుగుతుంది” అన్నారు.

సమాచార భారతి అద్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమానికి ప్రజ్ఞాభారతి తెలంగాణ,  జాతీయ సాహిత్య పరిషత్, భారతీయ ఇతిహాస సంకలన సమితి, తెలంగాణ, లాంటి సంస్థలు  సహకరిస్తున్నాయి.

శ్రీ గాజుల ర‌వీంద‌ర్ మాట్లాడుతూ ‘గోల్కొండ సాహితీ మ‌హోత్స‌వ్’ వివరాలు తెలిపారు. “ఇది రెండు రోజుల కార్యక్రమం అని ఇందులో ల‌బ్దప్రతిష్టులైన ర‌చ‌యిత‌లు, గ్రంథక‌ర్త‌లు, ప్రచురణ సంస్థలు, సాహితీవేత్తలు, పుస్త‌క‌ ప్రేమికులు పాల్గొంటారని, ఇది భాగ్యనగర్ న‌డిబొడ్డ‌లో అందరూ పాల్గొనేందుకు వీలుగా కేశ‌వ మెమోయల్ కాలేజ్, నారాయణగూడలో నిర్వహిస్తున్నార‌ని తెలిపారు.

శ్రీ నంది శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరంలో సాహిత్యం, జాన‌ప‌ద క‌ళ‌లు అత్యంత కీలక పాత్ర పోషించాయని, నాటి సాహిత్యం, స్వాతంత్య్ర పోరాటానికి దిశా నిర్దేశం చేస్తూ, దేశ అభివృద్ధికి దోహదం చేసిందని పేర్కొన్నారు. ఈ ఉత్సవంలో పుస్తక ఆవిష్క‌ర‌ణ‌లు కూడ జరుగుతాయి.

ఈ ఉత్మాసవం లోని కార్యక్రమాలు తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో జరుగుతాయని సమాచార భారతి  కరీంనగర్ జిల్లా బాధ్యులు శ్రీ తడిగొప్పుల శంకరయ్య తెలిపారు.

శ్రీ పరశురాం, శ్రీ బాల‌రాజు, శ్రీ  కొట్టే చంద్రశేఖర్, శ్రీ హరికాంత్‌, శ్రీ గంగాధర్,  శ్రీ  శ్రీకర్, శ్రీ శ్రీనివాస జియ్యంగార్, శ్రీ  శ్యామ్ రాజ్, శ్రీ  వెల్ముల జయ‌పాల్ రెడ్డి తో పాటు తదితరులు పాల్గొన్నారు.

 

 

Register As Delegate : https://golkondalitfest.org/register-as-a-delegate/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *