గోల్కొండ సాహిత్య మహోత్సవం బ్రోచర్ విడుదల

“గోల్కొండ సాహిత్య మహోత్సవం”  నిర్వాహకులు  నవంబర్ 6 వ తేది 2021 న  హైదరాబాద్ లోని “కేశవ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్” ఆవరణలో గోడ పత్రికను ఆవిష్కరించారు.  ఈ ఉత్సవాలు  ’75 వ స్వాతంత్య్రం  అమృత మహోత్సవ్’ ప్రధాన అంశంగా జరుగుతాయి.

ఈ సందర్బంగా శ్రీ వల్లిశ్వర్ మాట్లాడుతూ “స్వాతంత్య్ర  సంగ్రామంలోకి నిస్వార్థంగా దూకిన వీర కిశోరాలను జ్ఞాపకం  చేసుకోవడం ద్వారా నేటి తరం స్వాతంత్య్ర వీరుల త్యాగనిరతి దేశభక్తిని అర్థం చేసుకొని తద్వారా స్పూర్తిని పొందే అవకాశం కలుగుతుంది” అని అన్నారు.

ఈ బ్రోచర్ ను   శ్రీ జి వల్లిశ్వర్ , సీనియర్ పాత్రికేయులు, గోల్కొండ సాహిత్య మహోత్సవం నిర్వహికులు, డా అన్నదానం సుబ్రహ్మణ్యం , సెక్రటరి, కేశవ మెమోరియల్ విద్యా సంస్థలు, శ్రీ అయుష్, సెక్రటరి, సమాచారభారతి మొదలగు వారు ఆవిష్కరించారు.

గోల్కొండ సాహిత్య మహోత్సవం వివరాలు తెలిపుతూ  “ఇది రెండు రోజుల కార్యక్రమం అని ఇందులో లబ్ద ప్రతిష్టులైన రచయతలు, గ్రంథకర్తలు, ప్రచురణ సంస్థలు, సాహితీ వేత్తలు, పుస్త ప్రేమికులు పాల్గొంటారని, ఇది నగరం నడి బొడ్డులో అందరు వచ్చిందుకు వీలుగా ‘కేశవ మెమోరియల్ కాలేజి’ లో నిర్వహిస్తున్నమని శ్రీ అయుష్ తెలిపారు.

డా అన్నాదానం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ స్వతంత్ర సమరంలో సాహిత్యం జానపద కళలు అత్యంత ప్రభావ వంతమైన పాత్ర పోషించాయని, అప్పటి సాహిత్యం స్వతంత్ర భారత నిర్మాణానికి, అభివృద్ధికి దోహదం చేసిందని పేర్కొన్నారు.

ఈ ఉత్సవంలో పుస్తక ఆవిష్కరణ కూడ జరుగుతాయని సమావేశాలు తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో జరుగుతాయని నిర్వాహకులు తెలియచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *